: 150వ చిత్రానికి రెడీ... మెగాస్టార్ తో వరుణ్ తేజ్ ఫొటో పోజు!
‘గెట్ రెడీ ఫర్ ది మాసివ్ # చిరు 150’ అంటూ తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫొటోకు పోజు ఇచ్చాడు యువ హీరో వరుణ్ తేజ్. ఈ మేరకు ఒక ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. కాగా, చిరంజీవి అభిమానులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న 150 వ చిత్రం ప్రారంభోత్సవ ముహూర్తం ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు జరుగుతుందని అధికారికంగా నిన్న ప్రకటించారు. తమిళ చిత్రం ‘కత్తి’ రీమేక్ లో నటించేందుకు చిరంజీవి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించనుండగా, మెగాస్టార్ తనయుడు, యువహీరో రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. దీనికి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.