: తెలంగాణలో రెండు కీలక నియామకాలు... 'మిషన్ భగీరథ'కు వైస్ చైర్మన్, అధికార భాషా సంఘానికి అధ్యక్షుల నియామకం
తెలంగాణ సర్కారు మరో రెండు కీలక పదవులను భర్తీ చేస్తూ కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా దేవులపల్లి ప్రభాకరరావును నియమించింది. కేబినెట్ ర్యాంకు హోదాలో ప్రభాకరరావు ఏడాది కాలం పాటు ఈ పదవిలో ఉంటారు. ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నియమితులయ్యారు. కేబినెట్ ర్యాంకు హోదాలో ప్రశాంత్ రెడ్డి ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.