: ఉద్యమస్థాయిలో జల సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టాలి: ప్రజలకు చంద్రబాబు పిలుపు
నీరు-చెట్టు, జలసంరక్షణ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రజలందరూ ఉద్యమస్థాయిలో పనులు చేపట్టాలని ఆయన ఈరోజు పిలుపునిచ్చారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులతో విజయవాడలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ... వాన నీటి సంరక్షణ చేపడితేనే కరవు పరిస్థితులు రాకుండా చూసుకోవచ్చని అన్నారు. ప్రతీ ఇంట్లో వాన నీటిని కాపాడుకునేలా ఇంకుడు గుంతలు తవ్వకం చేపట్టాలని చెప్పారు. పంట కుంటల నిర్మాణాన్ని సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.