: రేపే టీడీపీలోకి గొట్టిపాటి!... ముహూర్తం ఖరారు చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే


వైసీపీ నేత, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ టీడీపీలోకి చేరే ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మొన్ననే తన మద్దతుదారులు, అనుచరులతో సంతమాగులూరులో సుదీర్ఘ భేటీ నిర్వహించిన గొట్టిపాటి పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు టీడీపీకి సమాచారం అందించిన ఆయన రేపు మధ్యాహ్న సమయాన్ని సుముహూర్తంగా నిర్ణయించుకున్నారు. భారీ అనుచరగణంతో విజయవాడ వెళ్లనున్న గొట్టిపాటి టీడీపీలో చేరతారు.

  • Loading...

More Telugu News