: వాళ్లిద్దరూ నాకు పిచ్చెక్కిస్తారేమో అనుకున్నాను: నిర్మాత అల్లు అరవింద్
‘దర్శకుడు బోయపాటి శ్రీను, మా అబ్బాయి అల్లు అర్జున్... వీళ్లిద్దరికీ సినిమా అంటే మహా పిచ్చి. చాలా ఇష్టంతో పనిచేస్తారు. వీళ్లిద్దరూ కలిసి నాకు పిచ్చెక్కిస్తారేమో అనిపించింది’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ‘సరైనోడు’ మూవీ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, ‘పిల్లలు కోరికలు కోరతారు. చాక్లెట్లు అడిగినట్లు బన్నీ నన్ను అడుగుతాడు. ఒకతను యాడ్ ఫిల్మ్ చేశాడట. అతను పేరు రుషీ పంజాబీ. అతను యాడ్ ఫిల్మ్ చేయడానికే రోజుకు కొన్ని లక్షల చొప్పున తీసుకుంటాడు. అటువంటి వ్యక్తి కావాలని, అతన్ని తీసుకురమ్మని చిన్నపిల్లాడు అడిగినట్లు బన్నీ నన్ను అడుగుతాడు. సరైనోడు చిత్రంలో ఇంటర్ వెల్ కు ముందు కేథరిన్ తో చేసిన సాంగ్ లో 130 మంది డ్యాన్సర్లు కావాలని, అది కూడా బాంబే డ్యాన్సర్లు కావాలంటూ బన్నీ కోరికలు కోరతాడు’ అని అరవింద్ చెప్పుకొచ్చారు.