: సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ నేత రఘువీరా బహిరంగ లేఖ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆ లేఖలో పేర్కొన్నారు. బెల్టుషాపులు ఎత్తివేయడం, రైతు రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన 120 హామీలు నెరవేర్చలేదని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేశారని, ఆదివాసీలకు అటవీభూముల హక్కులు నీరుగార్చారని, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో విఫలమయ్యారని ఆ లేఖలో ఆరోపించారు.