: ఆ పాత నాణెం.. అదిరిపోయే ధర!


అది ఓ పాత నాణెం! అమెరికాలో దాని వాస్తవ విలువ ఐదు సెంట్లే. మన భారత కరెన్సీలో రెండున్నర రూపాయలు. కానీ, అది 1913 సంవత్సరం నాటిది కావడమే ఇక్కడ విశేషం. ఈ పాత నాణేన్ని వేలం వేయగా వచ్చిన సొమ్మెంతో తెలుసా.. అక్షరాలా రూ.15 కోట్లు. వామ్మో.. అనుకుంటున్నారా! ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి నాణేలు ఐదు ఉండడంతో వీటికి ఇంత భారీ ధర పలికిందట.

ఈ నాణెం యజమాని ఓ కారు ప్రమాదంలో చనిపోగా, అతని సంబంధీకులు నాణేన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఈ నాణెం తాజాగా ఓ నలుగురు సోదరుల కంట బడడంతో దీని విశిష్టత వెలుగులోకి వచ్చింది. ఇంకేముంది, వేలం కేంద్రానికి నాణెం వచ్చిందో లేదో, పనామాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దీన్ని కోట్లు కుమ్మరించి ఎగరేసుకెళ్ళారు.

  • Loading...

More Telugu News