: మైనింగ్ శాఖ నుంచి నన్ను తప్పించండి: సీఎంకు హరీశ్ రావు వినతి
తాను నిర్వహిస్తోన్న మైనింగ్ శాఖ బాధ్యతల నుంచి తనను తప్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి హరీశ్ రావు కోరారు. భారీ నీటిపారుదల, మార్కెటింగ్, అసెంబ్లీ వ్యవహారాలు, మైనింగ్ శాఖ బాధ్యతలు తనపైనే ఉండడంతో పనిభారం ఎక్కువవుతోందని సీఎం కేసీఆర్ కు తెలిపారు. మైనింగ్ శాఖ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని సూచించారు. దీంతో మైనింగ్ శాఖను వేరొక మంత్రికి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.