: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే, పవన్ కల్యాణ్ ఎక్కడ?: ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఉదయ్ కిరణ్


ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే, పవన్ కల్యాణ్ నోటి నుంచి ఒక్క ప్రశ్న కూడా రావడం లేదేంటని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ ప్రశ్నించారు. శాసన సభా హక్కులను కాలరాస్తూ, ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపితే, పవన్ ఎక్కడున్నారని విమర్శించారు. ఈ ఉదయం హైదరాబాద్ లో ఇతర బీసీ నేతలతో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన, కేవలం సినిమా డైలాగులు చెబుతూ, యువతలోని అభిమానాన్ని అడ్డం పెట్టుకుని ఆయన తన పబ్బం గడుపుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ప్రశ్నించే వారే, ప్రజలకు సమస్యగా తయారయ్యారని, నిలకడలేని మనస్తత్వంతో, ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు పట్టకుండా, వాటిపై పోరాటం చేయకుండా ఉన్న పవన్ కు ప్రజలు, అభిమానులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News