: పడగ విప్పిన ర్యాగింగ్ భూతం!... నెల్లూరు పోలీసుల అదుపులో ఐదుగురు మెడికోలు


నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. సీనియర్ విద్యార్థుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూనియర్లు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న జూనియర్ల తల్లిదండ్రులు కళాశాల వద్దకు చేరుకుని తమ పిల్లలతో కలిసి ఆందోళనకు దిగారు. ప్రిన్నిపల్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగిపోయారు. ర్యాగింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నెల్లూరులో కలకలం రేపింది.

  • Loading...

More Telugu News