: కోరుకుని ఉంటే... మూడేళ్ల కిందటే ఎమ్మెల్సీని అయ్యేవాడిని: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు


ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు నిన్న ఓ కీలక వ్యాఖ్య చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏపీఎన్జీవోస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాజకీయంగా ఎదిగి పదవులు పొందాలన్న ఆసక్తి తనకు ఇసుమంతైనా లేదని సంచలన వ్యాఖ్య చేశారు. ఆ దిశగా రాజకీయాలపై తనకు మమకారం ఉండి, పదవి కావాలని కోరుకుని ఉంటే... మూడేళ్ల కిందటే ఎమ్మెల్సీని అయి ఉండేవాడినని ఆయన పేర్కొన్నారు. ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడిగా తాను ఈ స్థాయిలో ఉండటానికి ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటమేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News