: ట్విట్టర్ అనే పేరున్న మనిషినే పెళ్లాడతా: పూనంపాండే
సామాజిక మాద్యమాల్లో బాలీవుడ్ నటి పూనంపాండే పేరు ఎల్లప్పుడూ మార్మోగిపోతూనే ఉంటుంది. వివాదాస్పద వ్యాఖ్యలతోనో, హాట్‌హాట్ వీడియోలతోనో నెటిజన్లను తనవైపుకు ఆకర్షించుకునేలా ఈ అమ్మడు అన్ని విధాలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక సంచలన కామెంట్ చేస్తూ తన పాప్యులారిటీని మరింత పెంచుకోవాలని చూస్తుంది. తాజాగా 'ట్విట్టర్' అనే పేరున్న మనిషినే పెళ్లాడతానంటూ పూనంపాండే చేసిన ట్వీట్ ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశం అయింది. ట్విట్టర్ తన జీవితంలో భాగమైపోయింది కనుక ట్విట్టర్ అనే పేరున్న మనిషినే పెళ్లాడతానంటూ ఆమె చేసిన ట్వీట్‌కు అభిమానులు స్పందిస్తూ.. ‘నా పేరు ట్విట్టర్, నన్ను పెళ్లి చేసుకో’ అంటూ రీ ట్వీట్ చేస్తున్నారు. ఏమైనా, సోషల్‌మీడియా ద్వారా పాప్యులారిటీ సంపాదించడంలో తనకు సాటి ఇంకెవరూ రారు అనే విధంగా.. 25ఏళ్ల ఈ భామ తనను తాను ప్రచారం చేసుకుంటుంది.