: పసిబిడ్డను కొరికి చంపేసిన పెంపుడు కుక్క.. తల్లిదండ్రులు ఇంట్లో ఉండగానే జరిగిన విషాదం
మూడేళ్ల పసిపాపను పెంపుడు కుక్క కొరికి చంపేసిన ఘటన అమెరికాలోని శాన్ డియాగోలో స్టాన్ ఫోర్డ్ షైర్‌లో చోటుచేసుకుంది. పాపతో పాటు బెడ్‌పై ఉన్న పెంపుడు కుక్క.. ఒక్కసారిగా ఆ చిన్నారిని కొరకడం ప్రారంభించింది. ఆ సమయంలో ఆ పాప తల్లిదండ్రులు ఇంట్లో టీవీ చూస్తున్నారు. కుక్క పాపపై దాడి చేస్తుండడం గమనించిన తల్లిదండ్రులు.. కుక్క నుంచి పాపను దూరం చేసి, అనంతరం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ పాప ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. తాము ఇంట్లో ఉండగానే ఈ దారుణం చోటుచేసుకొని, తమ పాపను దూరం చేసుకున్న ఘటన పట్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.