: రావెల సుశీల్ ఎవరో తెలీదన్న మహిళ... కేసు కొట్టేసిన హైకోర్టు!


ఖరీదైన కారులో వస్తూ, ఓ ముస్లిం యువతి చెయ్యి పట్టుకుని కారులోకి లాగబోయాడని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు రావెల సుశీల్ పై పోలీసులు పెట్టిన కేసును కొద్దిసేపటి క్రితం హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళ, కోర్టుకు వచ్చి రావెల కిశోర్ ఎవరో తనకు తెలియదని వాంగ్మూలం ఇవ్వడంతో, సరైన సాక్ష్యాలు లేని కారణంగా సుశీల్ పై ఆరోపణలను తొలగిస్తున్నట్టు హైకోర్టు వెల్లడించింది. కాగా, తనపై పోలీసులు మోపిన అభియోగాలు తప్పుడువని చెబుతూ, ఇటీవల కోర్టులో సుశీల్ తరఫున పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా, బాధితురాలిగా పోలీసులు పేర్కొన్న మహిళ, తనకు సుశీల్ తెలియదని చెప్పడంతో కేసు వీగిపోయింది.

  • Loading...

More Telugu News