: చంద్రబాబు నా సోదరుని లాంటి వారు... మాది పూర్వజన్మ బంధం: కేంద్ర మంత్రి ఉమాభారతి


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును బీజేపీ సీనియర్ నేత, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తన సోదరుడిగా అభివర్ణించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా నిన్న ఆమెతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం చంద్రబాబును సాగనంపేందుకు బయటకు వచ్చిన ఉమా భారతి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు నా సోదరుడి లాంటి వారు. ఆయనను చూసినప్పుడల్లా మా ఇంటిలో వ్యక్తిని చూసినట్లే ఉంటుంది. మా ఇద్దరి మధ్య పూర్వజన్మలో ఏదో అనుబంధం ఉన్నట్లుగా ఉంది. చంద్రబాబు ఫాస్ట్ ట్రాక్ సీఎం. ఆయన పనిచేసే విధానం నాకెంతో ఇష్టం. ఆయన అనుకున్నది సాధిస్తారు. నేను మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎంగా లేరు. కానీ నేను ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నా. ఆయనలాగే పనిచేశా. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు పనితీరు గురించి చెప్పేదానిని’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News