: నా జీవితంలో ఇంతకంటే మంచి ప్రశంస ఉండదు: పాటల రచయిత అనంత శ్రీరామ్


‘ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇచ్చిన ప్రశంసను నా జీవితంలో మర్చిపోలేను. ఇంతకంటే మంచి ప్రశంస వేరే ఉండదు’ అని ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. రచనా రంగంలోకి ముప్ఫై ఏళ్లు దాటిన తర్వాతే రావాలని, అంతకంటే చిన్న వయస్సు వారు రావద్దని గతంలో కీరవాణి హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే, ఆయన చెప్పిన దానికి భిన్నంగా తాను చిన్న వయస్సులోనే పాటల రచయితగా నిలదొక్కుకోవడాన్ని కీరవాణి ప్రశంసించారని చెప్పారు. ఇదే తన జీవితంలో అత్యుత్తమ ప్రశంస అని.. ఇంతకంటే వేరే ఉండదని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News