: 2018లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు
2018 లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతిని ఈరోజు ఆయన ఢిల్లీలో కలిశారు. సమావేశం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించామన్నారు. కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించాలని కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు నిధుల కొరత రాకుండా చూస్తామని ఉమాభారతి హామీ ఇచ్చినట్లు చెప్పారు. కాగా, ఈ భేటీ లో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, ఎంపీ తోట నర్శింహం, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి పాల్గొన్నారు.