: జగన్ రెడ్డి గారూ... చివరకు మీ ఒత్తీ ఉండదు, మైనమూ ఉండదు: టీడీపీ నేత ఆనం వివేకా
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కొవ్వొత్తిలాగా కరిగిపోతుందన్నారు. అందుకు నిదర్శనం వారు చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనేనని అన్నారు. ‘జగన్ రెడ్డి గారూ... మీకు మనవి చేస్తున్నాను. మీ పార్టీ కొవ్వొత్తిలాగా కరిగిపోతే, చివరకు, మీ ఒత్తీ ఉండదు... మీ మైనమూ ఉండదు. మీ దీపం కొడిగట్టిపోతుంది. జగన్ రెడ్డీ, నువ్వు జైలుకు పోవడం ఖాయం. ఆ తర్వాత టీడీపీలో వైఎస్సార్సీపీ విలీనం కావడం ఖాయం’ అంటూ ఆనం వివేకా వ్యాఖ్యానించారు.