: పలుగు, పారా పట్టిన నటుడు రాజేంద్ర ప్రసాద్
ప్రముఖ సినీ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ పలుగు, పారా పట్టారు. ఈ ఉదయం హైదరాబాదు, రామానాయుడు స్టూడియోస్ లో ఇంకుడుగుంత తవ్వకాన్ని నిర్మాత దగ్గుబాటి సురేష్ ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంకుడుగుంతల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని, ప్రతి ఒక్కరూ తమ ఇంట గుంత తవ్వి వర్షపు నీటిని భూగర్భంలోకి మళ్లించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.