: గొడవలు వద్దు, సహకరించండి: విపక్షాలతో స్పీకర్ సుమిత్ర
పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ అభ్యర్థించారు. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఈ ఉదయం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన ఆమె, సభ సజావుగా సాగేందుకు విపక్షాలన్నీ చేయూత నివ్వాలని కోరారు. అన్ని అంశాలపై చర్చించి, సహేతుక నిర్ణయాలు తీసుకునేలా కృషి చేయాలని కోరారు. నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనలు, పోడియంలోకి చొచ్చుకు రావడం వంటి పనులు కూడదని హితవు పలికారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరఫున లోక్ సభా పక్ష నేత తోట నరసింహం, వైకాపా పక్ష నేత మేకపాటి తదితరులు హాజరయ్యారు.