: రామోజీరావు పనులను మెచ్చుకున్న ప్రధాని: వెంకయ్యనాయుడు


నీటిని ఆదా చేసుకునేలా ప్రజల్లో చైతన్యం తెస్తున్న రామోజీరావు చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఇంకుడు గుంతల తవ్వకాన్ని ప్రారంభించిన ఆయన, తదుపరి ప్రసంగించారు. తన మీడియాతో నీటి సంరక్షణను ఆయన ఉద్యమంలా చేస్తున్నారని ప్రశంసించారు. ఆయన చేపట్టిన ప్రచారాన్ని ప్రధానికి వివరించానని, ఆయనకున్న సామాజిక బాధ్యత పట్ల ప్రధాని సంతృప్తిని వ్యక్తం చేసి ప్రశంసించారని తెలిపారు. ఇంకుడుగుంతల తవ్వకం మహా ఉద్యమంగా సాగాలని, ముఖ్యంగా అనంతపురం వంటి కరవు జిల్లాల్లో వీటి అవసరం ఎంతో ఉందని వెంకయ్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News