: అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో తీవ్ర ఘర్షణ... విద్యార్థి మృతి, కార్యాలయానికి నిప్పు
అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్శిటీ క్యాంపస్ లో రెండు వర్గాలు బాహాబాహీకి దిగి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఒక విద్యార్థి మరణించగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. విద్యార్థి మరణంతో ఆగ్రహించిన ఓ వర్గం వర్శిటీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో పాటు రెండు వాహనాలను దగ్ధం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలు రౌండ్లను గాల్లోకి కాల్చాల్సి వచ్చింది. ప్రస్తుతం భద్రతా దళాలను మోహరించామని, పరిస్థితి కొంతమేరకు అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. వర్శిటీలో విద్యార్థుల ఘర్షణలపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.