: వైకాపాకు షాక్ మీద షాక్... శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి జంప్!


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఏ రోజు ఏ ఎమ్మెల్యే ఫిరాయిస్తున్నట్టు వార్త వస్తుందో తెలియని పరిస్థితి. నిన్నటికి నిన్న కడప జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా వైకాపా నుంచి తెలుగుదేశానికి ఫిరాయించగా, నేడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తాను టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కార్యకర్తలతో సమావేశమైన ఆయన, వారి అభీష్టం మేరకు పార్టీ మారాలని నిర్ణయించినట్టు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, చంద్రబాబు పాలనపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News