: హైదరాబాద్ - తిరుపతి విమానానికి తప్పిన పెను ముప్పు!
ఈ ఉదయం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి టేకాఫ్ అయిన విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఉదయం 6:55కు బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్టు గుర్తించిన పైలట్ వెంటనే సమాచారాన్ని ఎయిర్ పోర్టు అధికారులకు తెలిపాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అధికారులు అనుమతించడంతో విమానాన్ని సురక్షితంగా కిందకు దించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. క్షేమంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకోగా, తిరిగి వారిని తిరుపతి చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పైస్ జెట్ అధికారి ఒకరు తెలిపారు. విమానంలో తలెత్తన టెక్నికల్ ఫాల్ట్ ను సరిచేస్తున్నట్టు వెల్లడించారు.