: చరిత్రలో ఎక్కడైనా చూడండి... ఆ హామీని కేసీఆర్ తప్ప మరెవరూ ఇవ్వలేదు: ఎంపీ కవిత
రాష్ట్రంలోని ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయలేకపోతే, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లను అడగనని హామీ ఇచ్చిన ఏకైక నేత కేసీఆర్ ఒక్కరేనని నిజామాబాద్ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. చరిత్రలో మరెవరూ ఈ హామీని ఇవ్వలేదని ఆమె అన్నారు. నిన్న రాత్రి మహబూబ్ నగర్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభమై నీరు వస్తుందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి తప్ప పైసలు, పదవులపై తమకు ఆశలు లేవని, వాటి కోసం రాజకీయాలు చేయవలసిన అవసరం అసలే లేదని వివరించారు. జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థాయికి తీసుకువెళతామని తెలిపారు.