: కుటుంబంతో కలసి సోనియా ఇంటికి వీహెచ్


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వి.హనుమంతరావు, తన కుటుంబ సభ్యులందరితో కలసి అధినేత్రి సోనియాను కలిశారు. మరో రెండు నెలల్లో తన పదవీకాలం పూర్తి కానున్న సందర్భంగా, తనకు అవకాశం ఇచ్చిన ఆమెకు ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చానని వెల్లడించారు. మూడుసార్లు తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకున్న ఆయన, పదవి ఉన్నా, లేకపోయినా, ఓబీసీలకు రిజర్వేషన్లు, బడుగుల బాగుకోసం నిరంతరమూ శ్రమించానని మీడియాతో అన్నారు. భవిష్యత్తులో పార్టీ ఏ పని అప్పగించినా చేసేందుకు సిద్ధమని అన్నారు. వీహెచ్ వెంట ఆయన భార్య చంద్రకళతో పాటు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News