: పాకిస్థాన్ క్రికెట్ పతనమవ్వడానికి వకార్ కారణం: రజాక్ ఆగ్రహం
పాకిస్థాన్ జట్టుకు కోచ్ గా పని చేసి రాజీనామా చేసిన వకార్ యూనిస్ పై ఆ దేశ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. వకార్ యూనిస్ కారణంగా పాకిస్థాన్ క్రికెట్ పతనమైందని అన్నాడు. వకార్ యూనిస్ అభద్రతా భావంతో ఆటగాళ్లపై వివక్ష చూపేవాడని ఆరోపించాడు. సీనియర్లకు గౌరవం ఇచ్చేవాడు కాదని చెప్పాడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నాన్ని వకార్ ఏనాడూ చేయలేదని రజాక్ తెలిపాడు. దానికి తానే ప్రత్యక్ష సాక్ష్యమని రజాక్ తెలిపాడు. తాజాగా పాకిస్థాన్ జట్టు సలహాదారులుగా యూనిస్ ఖాన్, మిస్బావుల్ హక్ లను నియమించడంపై రజాక్ మండిపడ్డాడు. గత ఏడేళ్లుగా అన్యాయానికి గురైన పాక్ జట్టుకు వారు ఎలాంటి సలహాలు ఇస్తారని రజాక్ ప్రశ్నించాడు. పాకిస్థాన్ క్రికెట్ పతనానికి మాజీ క్రికెటర్లు కూడా కారణమయ్యారని రజాక్ ధ్వజమెత్తాడు.