: ఇక్కడ దీదీ తప్పుడు హామీలిస్తున్నారు, అక్కడ మోదీ కూడా అదే చేశారు: బెంగాల్‌లో రాహుల్
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. "ఇక్కడ మమతా బెనర్జీ తప్పుడు హామీలిస్తున్నారు, అక్కడ కేంద్రంలోనూ మోదీ తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు" అని ఆరోపించారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణం ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. బెంగాల్ ప్రభుత్వం ప్రజలను దోచుకుందంటూ మండిపడ్డారు. కష్టపడి సంపాదించి ప్రజలు దాచుకున్న డబ్బును శారదా చిట్‌ఫండ్ పేరుతో మమత ప్రభుత్వం స్వాహా చేసిందని విమర్శించారు. గతంలో ఉద్యోగాలు కావాలంటే బెంగాల్ వైపు చూసేవారని.. ఇప్పుడు ఇక్కడి వారికి ఉద్యోగాలు కావాలంటే వేరే ప్రాంతం వైపు చూస్తున్నారని అన్నారు.