: జగన్ జీవితమంతా డబ్బు చుట్టూతానే తిరుగుతోంది, ప్రతిపక్షనేతగా విఫలమయ్యారు: కాల్వ శ్రీనివాసులు
జగన్ జీవితమంతా డబ్బుచుట్టూనే తిరుగుతోందని తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. టీడీపీలోకి భారీ సంఖ్యలో వైసీపీ నేతలు చేరుతున్నందుకు 'సేవ్ డెమొక్రసీ' పేరుతో వైసీపీ తమ పార్టీపై చేస్తోన్న ఆరోపణలను ఆయన ఈరోజు తిప్పికొట్టారు. జగన్‌కు నైతిక విలువలు పట్టవని ఉద్ఘాటించారు. నియంతృత్వ పోకడలకు జగన్ ఫుల్‌స్టాప్ పెట్టుకోవాలని సూచించారు. జగన్ పార్టీలో ఉండలేకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. 'సేవ్ డెమొక్రసీ' పేరుతో వైసీపీ నాటకమాడుతోందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందెవరో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షనేతగా జగన్ విఫలమయ్యారని విమర్శించారు.