: దేవుడు, జాతకాలు వారికి పడవు, అయినా ముహూర్తం ప్రకారం నామినేషన్లు... తమిళనాట ఎన్నికల సిత్రం!


తమిళనాడులో నాస్తికులు అనగానే కరుణానిధి, వైగో వెంటనే గుర్తుకువస్తారు. వీరిద్దరికీ దేవుడు, జాతకాలు, ముహూర్తాలు వంటి వాటిపై ఆసక్తి ఉండదు. పైగా తమని తాము నాస్తికులుగా ప్రకటించుకుంటారు కూడాను. అలాంటి వీరు ముహూర్తం ప్రకారం నామినేషన్లు వేయడం తమిళనాట ఆసక్తిగొలుపుతోంది. ముఖ్యమంత్రి జయలలిత ఆచార సంప్రదాయాలు, దేవుడు, జాతకాలు, ముహూర్తబలాలు అన్నీ నమ్ముతారు. ఈ విషయం ఆమె బహిరంగంగా వ్యక్తం చేస్తారు. తన అనుయాయులకు కూడా ముహూర్తం ప్రకారం పనులు చేయమని సూచిస్తారు. ఈ నేపథ్యంలో ఆమె దుర్ముఖి నామసంవత్సరంలో బలమైన ముహూర్తం ఉన్న ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్ వేసేందుకు నిర్ణయించుకున్నారు. కాగా, ఇదే ముహూర్తాన కరుణానిధి, వైగో కూడా నామినేషన్ వేయాలని నిర్ణయించడం ఆసక్తి గొలుపుతోంది. కాగా, జయలలిత ఆర్కేనగర్ నుంచి పోటీ చేయనుండగా, కరుణానిధి తిరువారూరు నియోజకవర్గం నుంచి, వైగో కోవిల్ పట్టి నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నారు.

  • Loading...

More Telugu News