: నిప్పులు చెరిగిన కారులోంచి ప్రాణాలతో బయటపడ్డ మహిళలు, చిన్నారి
ఒక్కసారిగా కారులో మంటలు ఎగిసి పడినా.. వాటి నుంచి తప్పించుకొని ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి మృత్యుంజయులుగా నిలిచారు. ఈ ఘటన నిన్న మధ్యాహ్నం చెన్నైలో చోటుచేసుకుంది. అక్కడి గిండీ కత్తిపారా బ్రిడ్జీపై వేగంగా వెళుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విషయాన్ని ముందుగా కారు డ్రైవర్ గమనించాడు. మంటలు కారంతా వ్యాపించేలోగానే, క్షణాల్లో కారుని దిగి తలుపును తెరిచిన డ్రైవర్.. దానిలో ఉన్న మహిళలను, చిన్నారినీ బయటకు లాగేయడంతో వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. కారులో నుంచి అందరూ బయటపడిన క్షణాల్లోనే భారీ ఎత్తున ఎగిసి పడిన మంటలతో కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో అక్కడి బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.