: టీడీపీలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే!... 29న పార్టీ మారనున్న గొట్టిపాటి
ఏపీలో అధికార పార్టీ టీడీపీలోకి విపక్ష వైసీపీ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ పై విజయం సాధించిన చాంద్ బాషా టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది. చాంద్ బాషా కండువా మార్చిన మరుక్షణమే... ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి) కూడా సైకిలెక్కడం ఖరారైపోయింది. ఈ నెల 29న గొట్టిపాటి పార్టీ మార్చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరుతున్నట్లు అటు గొట్టిపాటి వర్గీయులతో పాటు ఇటు టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి.