: పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
నటనకు తనదైన శైలిలో భాష్యం చెప్పిన మహోన్నత నటుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలోనూ ఘనంగా చాటిన వ్యక్తి.. స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇంతటి ఘనతర ఖ్యాతి స్వంతం చేసుకున్న ఎన్టీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఆయన విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ చేతుల మీదుగా మే 7న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ వస్తారని భావిస్తున్నామని ఆయన కుమార్తె, కేంద్ర మంత్రి పురందేశ్వరి తెలిపారు.