: కాసేప‌ట్లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న జ‌గ‌న్


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి మ‌రికాసేప‌ట్లో గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. ప‌లువురు వైసీపీ నేతలతో క‌లిసి రాజ్‌భవన్‌లో జ‌గ‌న్‌ గవర్నర్‌తో భేటీ కానున్నారు. వైసీపీ నుంచి భారీగా ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తోందంటూ వ‌స్తోన్న వార్త‌ల నేప‌థ్యంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై గవర్నర్‌కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి పసుపు కండువా క‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా మ‌రికాసేప‌ట్లో టీడీపీ గూటిలో చేర‌నున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్‌ను జ‌గ‌న్ క‌ల‌వ‌నుండ‌డం ప్రాధాన్య‌తను సంతరించుకుంది.

  • Loading...

More Telugu News