: బిర్లా సైన్స్ సెంటర్ కు వెళితే డైనోసార్ అస్థిపంజరాన్ని చూడొచ్చు!
డైనో సార్ (రాక్షస బల్లి) అనగానే మనకు గుర్తుకు వచ్చేది స్టీవెన్ స్పీల్ బర్గ్ సినిమా ‘జురాసిక్ పార్క్’. కట్ చేస్తే... హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ సెంటర్ లో డైనోసార్ అస్థిపంజరంను ప్రదర్శనకు ఉంచారు. దీనిని చూసి వెళుతున్న ప్రదర్శకుల సంఖ్య ఇప్పటికే ఒక రేంజ్ కు చేరింది. దీనిని చూసేందుకు బిర్లా సైన్స్ మ్యూజియంలోకి వెళితే లక్షల సంవత్సరాల నాటి కాలానికి వెళ్లిన అనుభూతి కల్గుతోందని సందర్శకులు అంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శన వేళలుగా ఉన్నాయి.