: డివిలియర్స్ నన్ను ప్రోత్సహించాడు: కోహ్లీ


తనను డివిలియర్స్ ప్రోత్సహించాడని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కేఎల్ రాహుల్ అవుట్ కాగానే క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాడని చెప్పాడు. ప్రపంచ మేటి బ్యాట్సమన్ లలో ఒకడు దూకుడు ఆడుతుంటే చేయడానికి ఏమీ ఉండదని, చూడడం బాగుంటుందని కోహ్లీ చెప్పాడు. డివిలియర్స్ భారీ షాట్లు ఆడుతుండడంతో తాను యాంకర్ పాత్ర పోషించానని, స్ట్రయిక్ రొటేట్ చేయడమే తన పనిగా మారిందని, అందుకే పరుగులు, బంతులు సమానంగా మారాయని కోహ్లీ చెప్పాడు. తాను నియంత్రణ కోల్పోయి భారీ షాట్లకు వెళ్లిన ప్రతిసారీ...తాను క్రీజులో నిలబడడం ఎంత ముఖ్యమో డివిలియర్స్ గుర్తుచేశాడని కోహ్లీ తెలిపాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఆడానని కోహ్లీ తెలిపాడు. 185 పరుగుల స్కోరు తక్కువ కాదు కనుక విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువని కోహ్లీ తెలిపాడు.

  • Loading...

More Telugu News