: రేపు ఉదయం గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకుంటున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను ఉదయం 11 గంటలకు కలిసి ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని జగన్ కోరనున్నారు. కాగా, టీడీపీలోకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే చేరారు. అనంతపురం జిల్లాలోని కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా రేపు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.