: టెక్సాస్ ప్రావిన్స్ లో అలరించనున్న గోదావరి రుచులు - ఏప్రిల్ 23న గ్రాండ్ బఫెట్ తో ప్రారంభోత్సవం
డల్లాస్, యూఎస్ఏ, ఏప్రిల్ 22, 2016: ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ‘గోదావరి’ ఈ వారాంతంలో డల్లాస్, టెక్సాస్‌లో వినియోగదారులకు చేరువ కానుంది. సౌత్ ఇండియన్ అథెంటిక్ క్విజిన్ రెస్టారెంట్ అతిథుల మన్ననలు చూరగొన్న గోదావరి ఈ ప్రయాణంలో మరింత మందికి చేరువ అయ్యేందుకు బోస్టన్ నుంచి అమెరికాలోని దక్షిణ మధ్య ప్రాంతంలో తన ఫ్రాంచైజీలను ప్రారంభించనుంది. అనేక విశిష్టతలు కలిగి ఉన్న గోదావరి డల్లాస్ హై ఎండ్ రెస్టారెంట్‌గా నిలవనుంది. ఇందులో ‘స్పైసీ ఇండియన్ బార్’ కొలువుదీరి ఉండటమే కాకుండా దాదాపు 40కిపైగా బీర్ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా భారతీయ బీర్లు సైతం అలరించనున్నాయి. గోదావరికి చెందిన ఈ కొత్త రెస్టారెంట్ అత్యంతక ప్రాధాన్య ప్రాంతమైన ఇర్వింగ్‌లో కొలువుదీరి ఉంది. మార్క్ అర్థర్ బెల్విడ్ సమీపంలోని గాంధీ పార్క్‌కు అతి సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయులు వారికి నచ్చిన విలాసవంతమైన వంటకాలను స్వగ్రామ అనుభుతులను గుర్తుకు తెచ్చే గోదావరి రెస్టారెంట్‌లో ఆస్వాదించవచ్చు. “రెడ్ కార్పెట్ బఫెట్" పేరుతో అతిథులకు విస్తృత శ్రేణిలో వంటకాలు అందించేందుకు గోదావరి సిద్ధమైంది. ‘ఉయ్యూరు ఉలవచారు ఇడ్లీ’, ‘పెద్దమ్మగారి పెసర గారెలు’, ‘మంగమ్మ మామిడికాయ పులుసు’, వంటి కొత్త వెజ్ వెరైటీలు సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు నాన్ వెజిటేరియన్ వెరైటీల్లో ‘ముమైత్ ఖాన్ మాంసం కూర’, ‘కొరమీను కోమలం’,’ చెట్టినాడు పీతల ఇగురు’, ‘బెజవాడ బాతు కూర’ వంటి ఎన్నో చెవులూరించే వంటకాలు అతిథులకు అద్భుతమైన ఆతిథ్యాన్ని పంచనున్నాయి. యూఎస్ఏ గోదావరి రెస్టారెంట్ ఏర్పాటుచేసినప్పటి నుంచి అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగువారందరికీ ఇంటి భోజనాన్ని, తెలుగు సంస్కృతిని గుర్తుకు తెచ్చే రుచులతో కమ్మటి ఆతిథ్యాన్ని అందిస్తోంది. గోదావరి రెస్టారెంట్ వివిధ సందర్భాలు, పండుగ సమయాల్లో విశేష అతిథులను సాధరంగా ఆహ్వానిస్తోంది. సామాజిక బాధ్యతను మరిచిపోకుండా ఉండేందుకు గోదావరి గ్రూప్ రెస్టారెంట్ యాజమాన్యం కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. తెలుగు రాష్ర్టాల్లోని రైతులకు సహాయం చేసేందుకు, వారి పిల్లల చదువుకు అండగా నిలబడేందుకు ‘గోదావరి ఫౌండేషన్’ పేరుతో సహాయం చేసేందుకు సన్నద్దమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గోదావరి డల్లాస్ ఫ్రాంచైజీ యజమాని ఈశ్వర్ నాగులపల్లి మాట్లాడుతూ...’ఈ సంతోషకరమైన సందర్భం నాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. డల్లాస్‌లో గోదావరి ఫ్రాంచైజీని ఏర్పాటుచేయాలనే మా ప్రతిపాదనకు అంగీకరించి తక్కువ సమయంలోనే దానికి కార్యరూపం వచ్చేలా చేసిన ‘టీమ్ గోదావరి’ బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు’ అని తెలిపారు. ఫ్రాంచైజీ సహ యజమాని క్రిష్ణమోహన్ దాసరి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ‘టీమ్ గోదావరి బృందం ఆలోచన, ఆచరణ వల్ల టెక్సాస్ రాష్ట్ర వాసులకు, డల్లాస్ పౌరులకు కొంగొత్త రుచులు అనుభూతులోకి రానున్నాయి. గతంలో ఏనాడు ఆస్వాదించని ఈ రుచులు వారిని మైమరచిపోయేలా చేయడం ఖాయం’ అని అన్నారు. ఈ విస్తరణ గురించి గోదావరి సహ వ్యవస్థాపకుడు తేజ చేకూరి మాట్లాడుతూ “గోదావరిని మరిన్ని ప్రాంతాలకు మేం విస్తరించాలనుకుంటున్నాం. మిన్నెపోలీస్, డెన్వేర్, టోరంట్ (కెనడా) వంటి నగరాలెన్నో ఈ జాబితాలో ఉన్నాయి. గోదావరి తన రెండో కేంద్రాన్ని మారీస్‌విల్లేలోని రాలేహ్‌లో కొలువుదీరనుంది. ఇక్కడ కార్పొరేట్ అతిథుల కోసం అథెంటిక్ డిషెస్‌తో వడ్డించనున్నాం” అని తెలిపారు.
గోదావరిని నిరంతరం ఆదరిస్తూ వివిధ ప్రాంతాల్లో తమ అతిథులకు చక్కటి వంటకాలను అందించే అవకాశం కల్పిస్తున్న వారందరికీ పేరుపేరునా గోదావరి ధన్యవాదాలు తెలుపుతోంది.
ఇంతేకాకుండా గోదావరి రెస్టారెంట్ ద్వారా తెలుగు వంటకాలను #GoogleofIndianFood మరియు #IncredibleIndianFood పేరుతో హ్‌ష్ ట్యాగ్‌లు సృష్టించి పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తోంది. ఏప్రిల్ 23న ఢల్లాస్‌లో గ్రాండ్ బఫెట్‌తో ప్రారంభమయ్యే గోదావరి తమ వారసత్వాన్ని కొనసాగిస్తుందని గోదావరి పూర్తి భరోసాతో ఉంది. మీ ఆత్మీయ రాక కోసం గోదావరి ఎదురుచూస్తోంది. సంప్రదించవల్సిన చిరునామా: గోదావరి డల్లాస్, 660 వాల్‌నట్ రిడ్జ్ డీఆర్, ఇర్వింగ్, టెక్సాస్ 75038. సంప్రదించండి: (972) 751-6633 మరోమారు మీ ఆత్మీయ ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. సంప్రదించండి: క్రిష్ణమోహన్ దాసరి, DALLAS@GODAVARIUS.COM PH: 973-896-6617 www.Godavarius.com
Press note released by: Indian Clicks, LLC