: సైకిలెక్కనున్న వైఎస్సార్సీపీ మరో ఎమ్మెల్యే!


తెలుగుదేశం పార్టీలోకి వైఎస్సార్సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలోని కదిరికి చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా రేపు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుమారు 50 వాహనాలలో ఆయన అనుచరులతో కలిసి విజయవాడ బయలుదేరినట్లు సమాచారం. కాగా, చాంద్ బాషా ను బుజ్జగించేందుకని హైదరాబాద్ నుంచి వైఎస్సార్సీపీ నేతలు కదిరికి వెళ్లారని, అయినప్పటికీ ఆయన అందుబాటులో లేరని, చాంద్ బాషా ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్లు చెబుతున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ తో చాంద్ బాషా సోదరులు భేటీ అయ్యారని, ఈ నేపథ్యంలోనే రేపు ఆయన టీడీపీలో చేరనున్నారని చాంద్ బాషా వర్గీయుల సమాచారం.

  • Loading...

More Telugu News