: కేంద్ర మంత్రి నడ్డా, పలువురు బీజేపీ నేతలకు తప్పిన ముప్పు!


హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, నేతలకు ముప్పు తప్పింది. లిఫ్ట్ లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కు లిఫ్ట్ లో వస్తుండగా దాని వైరు తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాకపోతే, కొన్ని నిమిషాల పాటు వారు నిర్ఘాంతపోయారు.

  • Loading...

More Telugu News