: మళ్లీ టెస్టు మ్యాచులు ఆడతా: యువరాజ్‌సింగ్ ధీమా
మళ్లీ టెస్టు మ్యాచులు ఆడతానని టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ అన్నాడు. ముంబయిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. మళ్లీ టెస్టు మ్యాచుల్లో చోటు సంపాదించి, రాణిస్తానని పేర్కొన్నాడు. అలాగే తదుపరి వరల్డ్‌కప్‌లో ఆడడం తన ముందున్న మరో లక్ష్యం అని తెలిపాడు. వీలైనన్ని ఎక్కువ రోజులు క్రికెట్ ఆడిన తర్వాతే రిటైర్ అవుతానని చెప్పాడు. అప్పటి వరకు క్రికెట్‌లో మేటి ఆట కొనసాగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని అన్నాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గాయపడి, తదుపరి మ్యాచ్‌కు దూరం కావడం బాధ కలిగించిదని తెలిపాడు. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకొని 2019 వరల్డ్‌కప్ టీమ్‌లో చేరడానికి ప్రయత్నిస్తానని, ఆ వరల్డ్‌కప్‌లో ఆడితే అదే తనకు పదివేలు అని పేర్కొన్నాడు.