: పోటీలో ఉమ్మడి అభ్యర్థే లక్ష్యం.. జగన్‌తో భట్టి విక్రమార్క భేటీ
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల పోటీలో ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పలు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ను కలిశారు. పోటీలో ఉమ్మడి అభ్యర్థిని నిలిపే విషయంపై జగన్‌తో భట్టివిక్రమార్క చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భట్టి విక్రమార్క భేటీ అయిన సంగతి తెలిసిందే. టీడీపీతోనూ భట్టి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో పట్టున్న వైసీపీతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలిపితే టీఆర్ఎస్‌ను ఎదుర్కోవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది.