: చైనా పుండు మీద కారం చల్లిన భారత్!
చైనాలో ముస్లింలు అధికంగా నివసించే జింగ్ జియాంగ్ ప్రావిన్స్ కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ విఘర్ కాంగ్రెస్ నేత దొల్కన్ ఇసా భారత పర్యటనకు అంగీకరించి, వీసాను జారీ చేయడంతో, చైనా పుండు మీద భారత్ కారం చల్లినట్లయింది. ఇసా ఉగ్రవాదని, ఆయనపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీలులు జారీ చేసిందని చెబుతున్న చైనా, అతన్ని న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చేందుకు సహకరించాలని డిమాండ్ చేస్తోంది. జింగ్ జియాంగ్ లో ఉగ్రవాదానికి వరల్డ్ విఘర్ కాంగ్రెస్ మద్దతిస్తోందని ఆరోపించింది. ఏదైనా 'తనదాకా వస్తేకాని తెలీదన్నట్టు' ఇండియాపై ఉగ్రదాడులు చేయిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజర్ పై విషయంలో ఇండియాకు అడ్డంపడిన చైనాకు, ఇసాకు వీసా ఇవ్వడం ద్వారా గట్టి సమాధానం చెప్పినట్లయింది.