: యువరాజ్ సింగ్ ఇంటి గేటు పడి బాలుడి మృతి!
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంటి ముఖ ద్వారంలో ఉన్న గేటు మీద పడటంతో ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చండీగఢ్ లోని యువరాజ్ సింగ్ నివాసం వద్ద ఈ సంఘన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఏప్రిల్ 19వ తేదీన జరిగింది. అయితే, ఈ సంఘటన జరిగిన సమయంలో యువరాజ్, అతని తల్లి ఆ ఇంట్లో లేరు. హర్యానాలోని గుర్ గ్రామ్ నివాసంలో వాళ్లిద్దరూ ఉన్నారు. చండీగఢ్ లోని ఇల్లు సుందరీకరణలో భాగంగా మరమ్మతులు జరుగుతున్నట్లు, అందులో భాగంగా ఈ గేటును ఇటీవలే ఏర్పాటు చేయడం జరిగిందని ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.