: ఆచార్య ఆత్రేయ సతీమణి పద్మావతి కన్నుమూత
ప్రముఖ రచయిత, సినీ గేయ రచయిత, తెలుగు ప్రజలు ప్రేమతో మనసు కవిగా పిలుచుకునే దివంగత ఆచార్య ఆత్రేయ సతీమణి కేవీ పద్మావతి ఈ ఉదయం మరణించారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఈరోజు తుది శ్వాస విడిచినట్టు బంధువులు తెలిపారు. భర్త మరణం తరువాత, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని ముద్దునూరు పాడులో తన సోదరి నివాసంలో ఆమె కాలం గడుపుతున్నారు. ఆమె మృతదేహాన్ని సందర్శించిన పలువురు స్థానికులు, ఆత్రేయ అభిమానులు నివాళులు అర్పించారు.