: తిరుపతిలో అనుమతిలేని ప్రదేశంలోకి దూసుకొచ్చిన కారు.. హోంగార్డుల సస్పెన్షన్
తిరుమలలో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వీవీఐపీ వాహనాలకు సైతం అనుమతి లేని తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం వద్దకు ఓ కారు దూసుకొచ్చింది. ఘటనపై నిర్లక్ష్యం వహించిన టీటీడీ భద్రతా సిబ్బందిపై ఈవో సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భద్రతా సిబ్బంది కారును స్వాధీనం చేసుకున్నారు. భద్రతా వైఫల్యం కారణంగా ఈవో సాంబశివరావు ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేశారు. ఆ కారు టీటీడీ బోర్డు సభ్యుడు దొరస్వామిరాజుకు చెందినదిగా గుర్తించారు.