: రాజకీయాలు మారుతున్నాయి... చంద్రబాబు ప్రధాని అవుతారేమో!: జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు


రాష్ట్ర, దేశ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని తెలుగుదేశం నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుపతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిల్లు పడిందని, ఇప్పుడా పార్టీ నీరంతా పోతున్న జలాశయంలా ఉందని అన్నారు. 2019లో ఎన్నికలు జరిగే నాటికి వైకాపాలో ఒక్క నేత కూడా ఉండడని జోస్యం చెప్పిన ఆయన, జగన్ వైఖరి నచ్చకనే నేతలు పార్టీ మారుతున్నారని, జగన్ మారకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వుంటుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News