: చిత్తూరు బజారులో తొమ్మిదేళ్ల కుమార్తెను విక్రయానికి పెట్టిన తల్లి
తన తొమ్మిదేళ్ల కుమార్తెను విక్రయిస్తానంటూ ఓ తల్లి బేరం పెట్టిన సంఘటన చిత్తూరులోని ఓ బజారువీధిలో చోటు చేసుకుంది. అక్కడి వీధిలోకి భానుప్రియ అనే మహిళ తన కూతురితో చేరుకుని, స్థానికులతో బేరసారాలాడసాగింది. ఈ ఘటన పట్ల స్థానికులు తీవ్ర ఆశ్చర్చాన్ని వ్యక్తం చేస్తున్నారు. సదరు తల్లి తన కుమార్తెను బేరానికి పెడుతోన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. 'ఆర్థిక ఇబ్బందులే కుమార్తెను విక్రయించడానికి కారణమా..? లేదా మరేదైనా కారణమా..?' అంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.