: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను హైదరాబాద్‌లోని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. సుమారు 36 వెబ్‌సైట్లలో ఫలితాలు లభ్యమవుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోలాగే తెలంగాణలోనూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 53.32శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 62.72 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టినట్లు ఈ సందర్భంగా కడియం శ్రీహరి తెలిపారు.