: ఐటీ రంగంలో భారీగా తగ్గనున్న కొత్త ఉద్యోగాలు!


గత సంవత్సరంతో పోలిస్తే, 2016-17లో ఐటీ ఉద్యోగాలు 20 శాతం మేరకు తగ్గనున్నాయని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ చైర్మమ్ సీపీ గుర్నాని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్ కాన్ క్లేవ్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు. ఐటీ కంపెనీల ఆదాయం 10 నుంచి 11 శాతం వరకూ పెరగవచ్చని అంచనా వేస్తున్నామని, పలు కంపెనీలు ఆటోమేషన్ పై దృష్టిని సారించడంతో వృద్ధి నమోదైనప్పటికీ, కొత్త ఉద్యోగులను తీసుకునే అవకాశాలు ఉండవని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. దాదాపు రూ. 9,600 కోట్లకు విస్తరించిన భారత ఐటీ పరిశ్రమ ఈ సంవత్సరం 2.75 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. భారత్, అమెరికా దేశాల మధ్య పరస్పర అవసరాలు ఉండటంతో, ఎవరు అధ్యక్షుడిగా వచ్చిన ప్రభావం ఉండబోదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News